రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం…
– బిజెపి నాయకులు బలరాం
పటాన్ చెరు:
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకునేది లేదని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం రామచంద్రపురం పట్టణంలో రైతు గోస పోరు దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
రైతు గోస పోరు దీక్ష కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిజెపి నాయకులు బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి కొనుగోలు చేయాలని , రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్షను కొనసాగించారు.