_అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు..
_సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నరసింహారెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
డబుల్ బెడ్ రూమ్ పథకం పూర్తిగా అవినీతిమయం గా మారిందని సీపీఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు.పార్టీ అధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజక వర్గంలో నిజమైన పేదలకు కాకుండ కొంత మంది అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు.నియోజక వర్గంలోని అనేక పరిశ్రమలలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు, భవన్ నిర్మాణ కార్మికులు, ఇండ్లల్లో పని చేసే వాళ్ళు, అటో డ్రైవర్లు, మట్టి పని వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్లు ఇలా వేలాది మంది పేదలు గత అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని అన్నారు. వీరికి కాకుండ తెల్ల రేషన్ కార్డు లేని వారికి, స్థానికంగా నివాసం లేని వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు. అనర్హులను తొలగించాలని, అరుహులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో జయకుమార్, ఆంజనేయులు బుచ్చిరెడ్డి,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.
