శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు బిహేచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యా లయ హై స్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు సత్యభామ, గోపికలు, చిన్నికృష్ణుల వేశాదారణలతో అలరించారు. ఆటపాటలతో చక్కటి నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం టీచర్స్ డే ను పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, విద్యార్థులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.