ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

politics Telangana

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.2014 ధరలను పరిశీలిస్తే 50 శాతం నుండి 200 శాతం పెరిగాయని.గ్యాస్ ధరలు 1200 రూపాయలకు పెంచిదని.ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల లో ఉపాధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని.మోడీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లను తెచ్చి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఒకవైపు పేదల పైన భారాలు మోపుతు మరోవై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు.దళితులకు 3 ఏకరాల భూమి ఏమైందిని ప్రశ్నించారు.డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని.గృహ లక్ష్మి పతకం దర్కాస్తు దారులకు సర్వే చేసి 3 లక్షల రూపాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు,పాండు రంగా రెడ్డి,జార్జ్,శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *