పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి విద్యార్టీ ‘ఫెషర్స్ పార్టీ’ కోసం క్యాంపస్లో ప్రవేశం పొందిన సమయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికీ 26 ఆగస్టు 2023 ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. గీతమ్ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ పార్టీని నిర్వహిస్తారు. నిర్వహణా సౌలభ్యం కోసం ఈ ఆనందాన్ని రెండు రోజుల : పాటు విస్తరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ విద్యార్థులు శనివారం ఈ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్త విద్యార్థులకు ఆప్యాయంగా స్వాగతం పలకడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యం, ఇలాంటి పార్టీలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఈ పార్టీలో అత్యంత ముఖ్యమైన విషయం, కలిసి ఉండే క్షణాలను ఆస్వాదించడం, ప్రాంగణంలో భాగమైనందుకు వారికి మంచి అనుభూతిని కలిగించడం.స్కిట్లు, సంప్రదాయ, ఫ్యూజన్, ఆధునిక నృత్యాలు, ఉత్కంఠభరితమైన గానం, అద్భుతమైన అలంకరణ. వంటి ఉత్తకరమైన అంశాలతో ఫ్రెషర్స్ పార్టీ కొనసాగి, నునోహరమైన అనుభూతిని విద్యార్థులకు కలిగించింది.
రోజంతా విద్యార్థులు ఉత్సాహంగా, ఆనందంగా, సంగీత హోరుతో నవ్వుతూ, తుళ్లుతూ ఆనందంగా గడిపారు. ర్యాంప్ వాక్ సెషన్ ఈరోజు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హ్యూమానిటీస్ పార్టీలో అద్భుతమైన దృశ్యంగామిస్టర్ అండ్ మిస్ ఫ్రెషర్స్ ఎంపిక సాగింది. షాజియా మిస్ ఫ్రెషర్, అభిషేక్ మిస్టర్ ప్రెషన్-20237 బెటైర్లను కెవసం చేసుకున్నారు. తమ సీనియర్లు ఇచ్చిన పాదర స్వాగతానికి పరవశించిన నూతన విద్యార్థులు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.