– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సెర్రూట్ సీఈవో పవర్ ఉద్బోధ ఘనంగా ముగిసిన గీతం స్మార్ట్ ఐడియా థాన్
– విజేతలకు నగదు పురస్కారం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఔత్యాహిక పారిశ్రామికవేత్తలు ఎల్లవేళలా ఉన్నతంగా ఆలోచించాలని, అత్యధిక ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించి సమాజం మెప్పు పొందినప్పుడు ప్రపంచ మద్దతు లభిస్తుందని సెర్రూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పవన్ చందన అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గీతం స్మార్ట్ ఐడియా థాన్-2023 మూడవ విడత పోటీల (అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) ముగింపు ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
గతంలో స్టార్టప్‌లను ప్రజలు అంతగా విశ్వసించే వారు కాదని, కానీ కొన్ని విజయవంత గాథలు వింటున్న ఈ తరుణంలో వాటిపై సానుకూలత పెరిగిందన్నారు. స్టార్టప్‌లలో చాలా విఫలమైనా, అపజయాలు లేకుండా విజయం సాధించడలేరంటూ, వెఫల్యాలకు వెరవకుండా లక్ష్యించిన గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఏ వ్యాపారం రాణించాలన్నా మౌలికాంశాలపై పట్టు తప్పనిసరి అని, రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి ఆ లక్షణాలు పుష్కలంగా ఉండబట్టే అంతగా రాణిస్తున్నారని ప్రశంసించారు. వ్యవస్థాపకులుగా ఎదగడం ఉత్తమ కెరీర్ ఎంపికగా తాను భావిస్తానన్నారు.రెండేళ్ల క్రితమే అంతరిక్ష రంగంలో పోటీపడడానికి అందరినీ కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని, వచ్చే పదేళ్లలో ఆ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని పవన్ ఆశాభావం వ్యక్తపరిచారు.

కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలతో కూడుకున్న అంతరిక్ష రంగంలో కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వచ్చే 15 ఏళ్లలో ప్రపంచంలోని 50 శాతం శాటిలెట్ బ్రాడ్‌బ్యాండ్‌లో కలుపుతారని, ఉపగ్రహం నుంచి నేరుగా టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్నట్టు ఇకమీదట ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పొందొచ్చని చెప్పారు. స్పేస్ఎక్స్, వన్‌వెబ్, మారుతీ ఎయిర్టెల్ వేలాది ఉపగ్రహాలను ఇప్పటికే నింగిలోకి పంపాయని, మరిన్ని ఉపగ్రహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటిద్వారా మనదేశంలోని 50 శాతం జనాభా ఈ సదుపాయం లభిస్తుందన్నారు.సెర్రూట్ ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ, ఏడంతస్తుల ఎత్తుగల రాకెట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉందని, బహుళ ఉపగ్రహాలను కక్ష్యలోని ప్రవేశపెట్టగలదని సీఈవో చెప్పారు. వ్యక్తుల నేపథ్యం, జ్ఞానం, అనుభవం, లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ తమ ఉద్యోగులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఆకాశమే హద్దుగా ఔత్సాహిత పారిశ్రామికవేత్తలు ఎగదాలంటూ, గీతం స్మార్ట్ ఐడియా థాన్ విజేలతను ఆయన అభినందించారు.

సభాధ్యక్షత గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ, సెర్రూట్ గత ఆరేళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల నిధులను సమీకరించగలిగిందని, ఇంత పెద్ద మొత్తంలో మరే స్టార్టప్ నిధుల సేకరణ చేయలేదన్నారు. గీతమ్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) నిర్వహిస్తున్న వ్యవస్థాపకుడికి పరిచయ కోర్సు విద్యార్థులంతా వినియోగించుకోవాలని వర్ధమాన ఇంజనీర్లకు ఆయన సూచించారు. మన చుట్టూ ఉన్న సమస్యలపై విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశ్నించడం, తగిన పరిష్కారాలు చూపించే ఉత్సుకతను పెంపొందించుకోవడం వంటివి ప్రతి ఒక్కరూ చేయాలన్నారు.స్టార్టప్ ఇండియా సీనియర్ మేనేజర్ డాక్టర్ సురభి గుప్తా ఆ సంస్థ అందిస్తున్న సేవలను వివరించగా, గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీఐవో) కార్యక్రమ ఇతివృత్తాన్ని వివరించారు. తొలుత, వీడీసీ డెరైక్టర్ శ్రీదేవి దేవిరెడ్డి అతిథులను స్వాగతించి, కార్యక్రమ లక్ష్యాలను వివరించారు.


అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్రెగ్ కొలియర్, ప్రొఫెసర్ రవి రామమూర్తి స్టార్ట్ ఐడియా థాన్-2023 ఫలితాలను వెల్లడించి, విజేతలను సత్కరించారు.న్యూన్అప్ టెక్ సొస్యూషన్స్ వ్యవస్థాపకులు స్టార్ట్ ఐడియా థాన్ విజేతలుగా నిలిచి రెండు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని, పాలిఫ్యూయలర్ వ్యవస్థకులు ద్వితీయ బహుమతిగా లక్ష రూపాయలు, ఆగ్రోడ్రాయిడ్ సమాజంపై ప్రభావం చూపే ఆలోచన నిలిచి 50 వేల రూపాయలు, ఉత్తమ మహిళా వ్యవస్థాపకులుగా కోయాక్ట్ బృ ందం నిలిచి 50 వేల రూపాయలు గెలుచుకోగా, లెబెన్ జాన్సన్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును మెడీక్యాండీ గెలుచుకుని 50 వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందుకుంది. వీరికి గీతం ఖర్చుతో రెండు వారాల పాటు బోస్టన్‌లో నిర్వహించనున్న శిక్షణ పంపనున్నారు.
