_దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్
_సీఎం కెసిఆర్ మెదక్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతానికి ఏర్పాట్లు
_సీఎం పర్యటనను జయప్రదం చేయండి
గుమ్మడి దల, మనవార్తలు ప్రతినిధి :
రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకేసారి 115 మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.నేడు మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సందర్భంగా.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిద టోల్గేట్ వద్ద భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడారు.గత మూడు నెలల్లో మూడుసార్లు పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సాగడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు.సీఎం పర్యటన సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వివిధ రూపాల్లో స్వాగతం పలుకుతారని తెలిపారు.గుమ్మడిదల టోల్గేట్ వద్ద సీఎం కేసీఆర్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతారని ఆయన తెలిపారు. గుమ్మడిదల మండలానికి జూనియర్ కాలేజ్, మినీ స్టేడియం, గోదాం నిర్మాణానికి సహకరించాలని సీఎం కేసీఆర్ కి విన్నవించబోతున్నట్లు తెలిపారు.

ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం..
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అంతిమంగా పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే అంతిమమని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ప్రతీ కార్యకర్త సైనికుడి వలె కృషిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.జెండా, అజెండా లేని ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలకు సత్తా ఉంటే ఒకేసారి అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని సవాల్ చేశారు.సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.
ముదిరాజ్ లతో మాది స్నేహబంధం
తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుండి నేడు రెండుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు ముదిరాజులు ప్రతి అడుగులో తనకు అండగా నిలిచారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాను పుట్టిన బస్తీ ముదిరాజ్ బస్తీ అని, తన బాల్యం మొత్తం ముదిరాజ్ కులస్తులతో సాగిందని, నేటి వరకు వారితో కుటుంబ, స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు.రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని తెలిపారు.పటాన్చెరువు నియోజకవర్గంలోనూ ముదిరాజుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు.
మైనంపల్లి వ్యాఖ్యలు అర్ధరహితం..
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుండి నేటి బంగారు తెలంగాణ రూప కల్పనలో మంత్రి హరీష్ రావు పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న హరీష్ రావు పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
