మన వార్తలు, శేరిలింగంపల్లి :
దంత సమస్యలు తలెత్తకుండా చిన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డెంటల్ డాక్టర్ ప్రీతి అన్నారు. విద్యార్థులకు దంత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో విద్యార్థులకు జ్యోతి నగర్ లోని స్మైల్ పార్క్ అడ్వాన్సుడ్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి, అర్చన ల ఆధ్వర్యంలో శనివారం రోజు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పరీక్షలు నిర్వహించి, పళ్ళ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పల్లని శుభ్రపరచుకోవాలని, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించి, వైద్య పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందాలని కోరారు.
