-అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు
– గీతమ్ లో అవగాహనా వారోత్సవం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ర్యాగింగ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్‌పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.
అందులో భాగంగా, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విద్యార్థులు, ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ విద్యార్థి క్లబ్బుల సభ్యులు ఓపెన్ మెక్ష్, వీథి నాటకం, ఫ్లాషాబ్, నినాదాలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడం వల్ల జరిగే పరిణామాలు, పర్యవసానాలపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన గీతం హెదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ర్యాగింగ్ నిరోధానికి ఏర్పాటు చేసిన చట్టాలు, యూజీసీ నిబంధనలు, ర్యాగింగ్‌ను నేరంగా పరిగణించే వివిధ ఐపీసీ సెక్షన్లను వివరించారు. సరదాగా చేసే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, ఒకసారి విద్యార్థి పేరు పోలీసు రికార్డులలో నమోదయితే వారి భవిష్యత్తు అంథకారం అవుతుందని హెచ్చరించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులంతా ఎవరి పరిధి మేరకు వారు ర్యాగింగ్‌ను నిరోధించాలని, ఏవెనా సంఘటనలు వారి దృష్టికి వస్తే ర్యాగింగ్ నిరోధక బృందానికి తెలియజేయాలని రెసిడెంట్ డెరైక్టర్ సూచించారు.