పటాన్చెరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

politics Telangana

_జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

_అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

_విజేతలకు సొంత నిదులచే నగదు బహుమతులు అందజేత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని జాతీయ జెండాలను ఎగరవేశారు.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ను తిలకించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను, దివంగత గాయకుడు, ప్రజా యుద్ద నౌక గద్దర్ ను స్మరించుకుంటూ, తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ అలరించాయి.అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరులో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించేలా పటాన్చెరులో ప్రాథమిక పాఠశాల నుండి పీజీ కళాశాల వరకు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు.

పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో నూతనంగా బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్కోవడం జరిగిందని తెలిపారు.క్రీడారంగంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో నిలపాలన్న లక్ష్యంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఐదు ఎకరాల విస్తీర్ణంతో జిన్నారం, అమీన్పూర్, పటాన్చెరులో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వివిధ క్రీడా అంశాల్లో రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన ఆరిజిన్ హై స్కూల్ కి ప్రథమ బహుమతి (20,000 రూపాయలు), విద్యానికేతన్ హై స్కూల్ ద్వితీయ బహుమతి (15,000 రూపాయలు), శ్రీ చైతన్య హై స్కూల్ (10,000 రూపాయలు) నగదు బహుమతి, మెమొంటోను అందజేశారు..ఉత్తమ మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన మంజీర హై స్కూల్ కి ప్రథమ బహుమతి (20,000 రూపాయలు), శ్రీ చైతన్య హై స్కూల్ (15,000 రూపాయలు), జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (10,000 రూపాయలు) అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, డి.ఎస్.పి పురుషోత్తం రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఎంఈఓ రాథోడ్, తాసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో బన్సీలాల్, సిఐలు లాలు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *