_పటాన్చెరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ అందించి వారిని వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు నియోజకవర్గంలో వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు ఉండకూడదని సమన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతోపాటు దశాబ్దాల చరిత్ర గల ఆర్టీసీనీ సైతం ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో విఆర్ఏ లు గా పని పనిచేసిన వారందరూ నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా నియామకం జరిగిందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి పేరు తెచ్చేలా పనిచేసి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఆయన సూచించారు.
అనంతరం పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 80 రోజులపాటు నిరవదిక సమ్మె చేసిన సమయంలో దసరా పండుగ వస్తే ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గొప్ప మనసున్న నాయకుడు ఎమ్మెల్యే జిఎంఆర్ అని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ తమ సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం పలువురు విఆర్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. విఆర్ఏలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నాగేష్ కురుమ, షేక్ హుస్సేన్, రాజేష్, రాజన్ సింగ్, వీఆర్ఏల సంఘం రాష్ట్ర కోకన్వీనర్ వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షులు షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.