గీతమ్ లో ఐఈఐ విద్యార్థి విభాగం ప్రారంభం

politics

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఈకణ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ రామేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగాన్ని” గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐతల తెలంగాణ విభాగం అధ్యక్షుడు బి. బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హెదరాబాద్ (ఎసీసీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు, ఐత్వల పరిశోధన-అభివృద్ధి విభాగం జాతీయ అధ్యక్షుడు ఐ.సత్యనారాయణ రాజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతల విద్యార్థి విభాగం సభ్యత్వం ప్రాముఖ్యత, ఒనగూరే ప్రయోజనాలు గురించి బ్రహ్మారెడ్డి వివరించారు.. ఐఈఐనీ 1920లో స్థాపించారని, మనదేశంలో 15 ఇంజనీరింగ్ విభాగాలలో ఎనిమిది లక్షల నుంది సభ్యులతో 25 కేంద్రాలు ఉన్నాయని, 2,100 విద్యార్థి విభాగాలు దీనికి అదనమని ఆయన చెప్పారు. ఐఈఐ విద్యార్థి విభాగంలో సభ్యత్వం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ రామేశ్వరరావు వివరించడంతో పాటు ఈఎసీసీఐ కార్యకాలను, ఇప్పటివరకు పొందిన ప్రతిష్ఠాత్మక అవార్డుల గురించిన ఓ వీడియోను ఆయన ప్రదర్శించారు. 3రిశోధనలను చేపట్టే విద్యార్థులను ఐఈల ప్రోత్సహిస్తుందని, తగిన నిధులను కూడా నుంజూరు చేస్తుందని. డాక్టర్ సత్యనారాయణ రాజు భరోసా ఇచ్చారు.

ఐఈఐతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని, విద్యార్ధిగా ఉన్నప్పుడు ఉత్తమ పత్ర సమర్పణకు గాను పొందిన బంగారు పతకం వివరాలను ఈ సందర్భంగా గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథులను స్వాగతించగా, ప్రొఫెసర్ ఈశ్వర్ వందన సమర్పణతో మొగిసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు బి.టెక్. అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *