పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన గూడెం మహిపాల్ రెడ్డిని ఆదివారం ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యే జిఎంఆర్ కు పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.