సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

Hyderabad Lifestyle Telangana

_ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ప్రారంభించిన సినీ నటి ప్రణీత 

_ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి

మనవార్తలు ,హైదరాబాద్:

ఈ ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమని ప్రముఖ సినీ నటి ప్రణీత అన్నారు. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో నేటి మహిళల్లో సంతానం కలగడం మంగళవారం సికింద్రాబాద్ ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను సినీ నటి ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృత్వం ఒక వరం. ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి, పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయని, ఆధునిక పద్దతుల ద్వారా సులభతరంగా సంతాన సాఫల్యం పొందవచ్చని చెప్పారు. ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎంతో ఆదుకుంటున్నాయని చెప్పారు.

సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని, మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు. వరల్డ్ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం ను సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో ప్రారంభించినట్లు చెప్పారు. ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వైద్య శాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

వరల్డ్ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్ లలో మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని వేలమందికి ఐ వి ఎఫ్, ఐ సి ఎస్ ఐ, ఐ ఏం ఎస్ ఐ , ఉచిత వైద్య శిబిరాలను పలు ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహించినట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 95504 00445 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *