మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి

politics Telangana

_సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ అధ్వర్యంలో పట్టణంలోని జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మే నెలలో మహిళలను నగ్నంగా ఊరేగించి న ఘటనలో దుండగులనువెంటేనే కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారు.మణిపూర్ లో మహిళల పై జరుగుతున్న దాడుల విషయం లో సమాజం తల దించు కోవలసి వస్తుందని అన్నారు.దీనికి కారణం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వాల దే బాధ్యత అన్నారు.మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో మహిళలకు రక్షణ కల్పించే విషయంలో బి జె పి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు.

తెగల మద్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని కేంద్రం చూస్తుందని మండిపడ్డారు.ఇంత జరిగిన పార్లమెంట్ లో చర్చించడానికి ప్రధాన మంత్రి సిద్దంగా లేకపోవడం అత్యంత దారుణమన్నారు.ప్రశాంత మైన వాతావరణం వున్న మణిపూర్ రాష్ట్రంలో గత 2 నెలలుగా గొడవలు జరుగుతున్న శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అదని విమర్శించారు.మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దోషులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనిపక్షంలో మణిపూర్ ప్రజలకు అండగా దేశ వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్ నర్సింహారెడ్డి,ఊపాదక్షులు బి నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు సుధాకర్,బి పాండురంగా రెడ్డి,శ్రీనివాస్,వెంకటేష్,కిరణ్,రాంచందర్, మనిరాజు,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *