పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు నల్లగొండ నరసన్న చే ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన పైన అభిమానంతో పాటను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.కేటీఆర్ ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గంలోని 300 మంది వికలాంగులకు మూడు కోట్ల రూపాయలతో స్కూటీలు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపున పుట్టిన ఆణిముత్యం కేటీఆర్ అని కొనియాడారు. తెలంగాణ చరిత్రలోనే ఐటీ రంగాన్ని కొత్త పుంతలు అద్దుతూ, ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
