డబుల్ బెడ్ రూం ఇళ్ళు చాలా వరకు శిధిలావస్థకు చేరుకున్నాయి : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. నాణ్యత లోపంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు పూర్తి కాకుండానే మరుగునపడ్డాయని పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. పటాన్ చెరు పరిధిలోని చిట్కూల్ గ్రామంలోె డబుల్ బెడ్ రూం ఇండ్లను గడీల శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు . అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పాలన పూర్తయిన పార్టీ నిర్లక్ష్యం కారణంగా డబుల్ బెడ్ రూంలు కట్టిన వాటిని లబ్దిదారులకు కేటాయించలేదని పర్యవేక్షణలోపం కారణంగా శిధిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు .

సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గానికి వచ్చి ప్రగల్బాలు పలుకుతూ తూతూ మంత్రంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభించారని …పెండింగ్ లో ఉన్న వాటి గురించి మాట్లాడలేదన్నారు . ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యే ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవాచేశఆరు . బీసీ బంధు ,మైనార్టీ బంధు ,దళిత బంధు పేరుతో అంటూ అబద్దపు ప్రచారాలు మానుకుని డబుల్ బెడ్ రూంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మేలుకొని నియోజకవర్గ స్థాయిలో ఉన్న పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు . పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున పోరాడి ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్ , జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ,భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ , పటాన్ చేరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు , జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, జిల్లా కిసాన్ మొర్చా నాయకుడు వీరారెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డి,మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జోగు ధన్ రాజ్,బిజేవైయం పటాన్ చెరు అసెంబ్లీ కన్వీనర్ రాజ్ గోపాల్ యాదవ్, యస్.ఆర్.కే‌ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *