పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
అంటువ్యాధుల నివారణ కోసం ఉత్పత్తి చేసే రోగనిరోధక ఔషధాల ప్రత్యామ్నాయ ఉత్పత్తి మార్గాలని దృష్టి సారించాలని మలేసియాలోని యూఐటీఏం మారా సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ రవి శేషాల సూచించారు. గీతం. స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘రోగనిరోధక శక్తికి మూలాలుగా మొక్కలు: ఔషధ పంపిణీ మార్గాలు’ అనే అంశంపై సోమవారం: ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు. ఆ విద్యా సంస్థకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో ఉన్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అంటువ్యాధులు, నాటికి కారణమయ్యే సూక్ష్మజీవుల గురించి డాక్టర్ రని వివరించారు. సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే వ్యాధులకు రోగనిరోధక శక్తిని కలిగి ఉండడం, దానిని పెంపొందించుకునేందుకు ప్రత్యామ్నాయ వనరులను కలిగి ఉండవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో ఔషధ మొక్కల పాత్ర గురించి, దానిని వారు చేపట్టిన పరిశోధనలను ఆయన వివరించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.తొలుత, స్కూల్ అఫ్ సార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని స్వాగతించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.హెర్డు ఆయనను విద్యార్థులకు పరిచయం చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు: ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.