_నేటి తరానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ
_మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అదే స్ఫూర్తితో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ చౌరస్తాలో సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహనీయుల పోరాట చరిత్రను నేటి తరాలకు తెలియజేయ చెప్పాలన్న ఉద్దేశంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ఉద్యమకారులను నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సేవలను స్మరించుకుంటూ, వారి గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. పటాన్చెరులోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్ర శేకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.