నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ’

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం ఆవశ్యమని, అప్పుడే కొత్త నైపుణ్యాలు, జ్ఞానం అలవడతాయని క్యాఫ్రికాల్ టెక్నాలజీస్, ప్రొడక్ట్ మేనేజర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.ఇందులో ప్రధాన వక్తగా పాల్గొంటున్న ఆయన మాట్లాడుతూ,అందుబాటులో సాంకేతికపరిజ్ఞానంఆరు నెలల్లో మారిపోతోందని, కొన్నిసార్లు పూర్తిగా కొత్తదనం సంతరించుకుంటోందన్నారు. తాను బీటెక్ పట్టానిఇంజనీరింగ్ లేదా విద్యా ప్రారంభంగానే భావించానని, ఎందుకంటే, ఐదేళ్లకోసారి కొత్త సాంకేతిక వస్తోందని, దానినిఅది నుంచి నేర్చుకోకపోతే విద్యార్థుల ముందు నిలబడడం కష్టమవుతుందని ఆయన స్పష్టీకరించారు.

చాలానుంది విద్యార్థులు సాంకేతికతతో ప్రేరేపితులవున్నారని, అయితే దానిని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదన్నారు. కొత్త పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించే ముందు, అధ్యాసకులంతా దాని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అలవరచుకోవాలని, అప్పుడే సరైన బోధన, ప్రాజెక్టులను చేపట్టగలమని ఆయన ఉద్ఘాటించారు. రోబోటిక్ పరిజ్ఞానంతో రూపొందించిన టిక్ టాక్ -టో గేనును మంగళవారం సదస్యుల ముందు ప్రదర్శిస్తారని ప్రేమ్ హామీ ఇచ్చారు.

తొలుత, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య మాట్లాడుతూ, ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నూతన జ్ఞానాన్ని పొందాలని, కొత్త వెపుణ్యాలను అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ లక్ష్యాలను ఈతసీత విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి వివరించగా, కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ కె. మంజునాథాచారి వందన సమర్పణతో ప్రారంభోత్సవం. ముగిసింది. ఈ ఎన్డీపీ బుధవారం వరకు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *