గీతమ్ పీఎఫ్ఎంఏ వర్క్ షాప్ ప్రారంభం

Telangana

-మూడు రోజుల కార్యశాలను లాంఛనంగా ఆరంభించిన ఐఐటీ ఖరగ్పూర్ డీన్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్: మెథడ్స్ అండ్ : అప్లికేషన్స్ (పీఎఫ్ఎంఏ – పార్ట్ 4) మూడు రోజుల కార్యశాలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బంటి ఖర్పూర్లోని ఫ్యాకల్టీ ఆఫ్ సెస్ పూర్వ డీన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ఈ కార్యశాల నిర్వహణ ముఖ్యోద్దేశాన్ని వివరించారు. ఇందులో భాగంగా, తాము కొన్ని అధునాతన సాంకేతికతలను సదస్యులకు పరిచయం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మెరుగిన సింథటిక్ పద్ధతులు, సాంకేతిక రచన, పత్ర సమర్పణ మెళకువలను కూడా నేర్పిస్తామన్నారు.

ఈ పీఎఫ్ఎంఏ పార్ట్ – 4 కార్యశాల ఈ సిరీస్లో వివరిదని, దీనిని సదస్యులంతా సద్వినియోగం చేసుకుని, సొంతంగా ప్రయోగాలు చేయమని ఆయన ప్రోత్సహించారు. ఎన్నో కష్టనష్టాలు, కరోనా వంటి మహమ్మారి నేపథ్యంలో కూడా వరుసగా నాలుగు కార్యశాలలను నిర్వహించిన గీతం గణిత శాస్త్ర విభాగం అధ్యాపకులను ఆయన బహుదా ప్రశంసించారు.తొలుత, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మాతహర్ రజా సభకు స్వాగతం పలికి, దాని లక్ష్యాలను వివరించారు. చివరిగా వందన సమర్పణ చేశారు. వర్క్ షాప్ ఇతిన్ఫత్తాన్ని ప్రొఫెసర్ కె.నూరుతీప్రసాద్ వివరిస్తూ, గర నాలుగేళ్లగా ఈ కార్యశాలను ప్రతియేటా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

కార్యశాల నిర్వాహకుడు ప్రొఫెసర్ నార్ల వంశీకృష్ణ మాట్లాడుతూ, తాము విధానాలు, పత్ర సమర్పణ. మెళకువలు, దానిపై వచ్చిన వ్యాఖ్యలను సమీక్షించడం అనే రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఈ సిరీస్లో చివరిదిన ఈ మూడు రోజులు కార్యశాలలో చురుకుగా పాల్గొని, సద్వినియోగం చేసుకోవాలని సదస్యులను అభ్యర్థించారు. ఈ ప్రారంభోత్సవంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి దాదాపు 50 మంది -ప్రతినిధులు పాల్గొన్నారు. బుధవారం వరకు ఈ వర్క్షాప్ కొనసాగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *