_6 లక్షల రూపాయల సొంత నిధులచే గ్రామైక్య సంఘం సహాయకులకు ఏకరూప దుస్తులు, ఐడి కార్డుల పంపిణీ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామైక్య సంఘం సహాయకులు (వివో ఏ) లకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేయూతను అందించారు. నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామాలలో పనిచేస్తున్న 200 మంది వివోఏ లకు 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు జతల ఏకరూప దుస్తులు, ఐడెంటి కార్డులను అందించారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరువు మండల పరిధిలో పనిచేస్తున్న విఏవోలకు వీటిని అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
