రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని మంగళవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. నూతన భవనం ఏర్పాటయ్యే వరకు.. తాత్కాలిక పోలీస్ స్టేషన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పోలీస్ స్టేషన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన పోలీస్ ఏర్పాటుతో తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు ప్రజలకు పోలీస్ శాఖ సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.