ఇంట్లో రెమ్‌డెసివిర్ వాడొద్దు… ఏఐఐఎంస్...
న్యూఢిల్లీ:
ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న రోగులు రెమ్‌డెసివిర్ తీసుకోవద్దని ఏఐఐఎంఎస్ వైద్యులు సూచించారు.
ఆక్సిజన్ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆస్పత్రిలో చేరాలని వారు అన్నారు. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న వారు వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఇంటి దగ్గర రెమ్‌డెసివిర్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్ నీరజ్ నిశ్చల్ స్పష్టం చేశారు.
మరో వైద్యుడు మనీష్ మాట్లాడుతూ ఆక్సిజన్ స్థాయి 94కంటే తగ్గినవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరాలని అన్నారు.
