– బాలికలదే పై చేయి
– విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు,78 విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 74 మంది విద్యార్థులు 9.6 నుండి 9.6 వరకు పాయింట్స్ సాధించారు, నలుగురు విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధించి పాఠశాల పేరును జయ కేతనాన్ని ఎగురవేశారు. సాయి ధనుష శ్రీ, చందన, స్పందన, వర్షిని, బాలికలు 10/10 పాయింట్స్ సాధించి తమ ప్రతిభను ప్రఖ్యాతి గాడించారు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు, ప్రిన్సిపల్ బీనా, అనిల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, పటాన్ చెరు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు, భవిష్యత్తులో బ్రహ్మాండమైన విజయాలు సాధించాలని కోరారు .
ఈ సందర్భంగా శిశు విహార హై స్కూల్ ప్రిన్సిపల్ బీనా అనిల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 12 సంవత్సరల నుండి పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు, 13 మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల ప్రస్తుతం పదవ తరగతిలో 78 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను మేము చెబుతున్న బోధనలను అందరికీ తెలిసేలా పేరు ప్రఖ్యాతలను పెంచినందుకు విద్యార్థులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు గా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు .