నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియః ఎసిఎస్ శాస్త్రవేత్త

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, ముఖ్యంగా సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని, టీసీఎస్ పూర్వ ఉపాధ్యక్షుడు, ముఖ్య శాస్త్రవేత్త నారాయణ జీసీఎల్ (నుండలీక) అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో, ఐ ట్రిపుల్ ఈ విద్యార్థి విభాగం సౌజన్యంతో ‘టెక్ఆక్వినాక్స్’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల టీ హ్యాకథాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అందులో ముఖ్య అథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సృజనాత్మకతకు ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయం.లేదన్నారు. జీవితాంతం నేర్చుకోవడం, సృజనాత్మకంగా యోచన, క్లిష్టమైన ఆలోచన, సానుభూతితో సందర్భాను సారం వ్యవహరించడం, వ్యవస్థాపకత వంటి లక్షణాలను ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హెట్రిక్, హెటచ్, హెక్టాన్సెప్ట్ విధానం కొనసాగుతోందని, విద్యార్థులు అందుకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళనకూ తావుండదని ఆయన స్పష్టీకరించారు.

నీ విద్యార్థి అయినా ఒక సవాలును ఎదుర్కునేటప్పుడు, ఆ సమస్యను స్పష్టంగా నిర్వచించాలని, అది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో గ్రహించాలని, దానికి ఇతరుల కంటే మెరుగైన పరిష్కారాన్ని సూచించగలగాలని, నారాయణ సూచించారు. అలాగే నునం రూపొందించిన అంశాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వివరించాలని, సమష్టి, కృషిని నొక్కిచెప్పాలని, పీలెనంత వరకు దానిని సచిత్రంగా వివరించడం మంచిదన్నారు.సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య -మాట్లాడుతూ, ఈ 30 గంటల హ్యాకథాన్లో పాల్గొనే వారంతా, దానిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రమాదాల:: విచారణకు మోటార్ సెక్షిల్ వేగాన్ని తల్లిదండ్రులు నియంత్రించ గలిగే ఆవిష్కరణ చేయాలని సూచించారు.తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి మాట్లాడుతూ, జంట నగరాల చుట్టుపక్కల నుంచి దాదాపు 15 కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఐ ట్రిపుల్ ఈ విద్యార్థి. విభాగం కౌన్సెలర్ డాక్టర్ ప్రశాంత ఆర్.ముదిమెల తన స్వాగతోపన్యాసంలో, తాము ఇచ్చి పలు అంశాలకు సంబంధించిన 23 ఎంట్రీలు వచ్చినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *