లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు…
-ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
పటాన్‌చెరు :
జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు . జిల్లాలో పరిశ్రమలు ఎక్కు వగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు చెందిన వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయన్నారు . జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహి స్తున్నారని తెలిపారు . వాహన పాసులు అవసరమైన వారికి అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ , నారాయణఖేడ్ లలో మొత్తం నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు . ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీం రెడ్డి , సీఐ వేణుగోపాల్ రెడ్డి , ఎస్సైలు ప్రసాద్ రావు , సాయిలు ట్రాఫిక్ ఎస్ఐలు రాములు ఆంజనేయులు దితరులు పాల్గొన్నారు