పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 31న ‘ఫ్రాడ్ అనలిటిక్స్ అండ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్’పై ఒకరోజు ఆన్లెన్డ్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఎస్ఓసీ)తో కలిసి దీనిని నిర్వహిస్తున్నట్టు అకౌంటింగ్ విభాగాధిపతి డాక్టర్ గుత్తి ఆర్.కె.ప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.తాజా మోసపు పోకడలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్ పద్ధతులపై ఈ వర్క్షాప్ లోతెన అవగాహనను కల్పిస్తుందని, ఇందులో పాల్గొనేవారికి, వారు పనిచేసే సంస్థలను రక్షించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందిస్తుందన్నారు.సంస్థలలో మోసానికి గల కారణాలు-పర్యవసానాలను అర్థం చేసుకోవడం; మోసం తాజా పోకడలు, ఆ వాతావరణాన్ని పసిగట్టడం; ఫోరెన్సిక్ అకౌంటింగ్ పద్ధతులను నేర్చుకోవడం; మోసాన్ని గుర్తించి, అర్థం చేసుకోవడానికి ఫోరెన్సిక్ అకౌంటింగ్ను ఎలా వినియోగించాలి వంటి అంశాలపై అవగాహన ఏర్పరచడం ఈ కార్యశాల లక్ష్యంగా డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.యూజీ, పీజీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు, కార్పొరేట్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లు, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్-ప్రాక్టీషనర్లు డెరైక్ట్ టు డివెస్ట్ పద్ధతిలో జరిగే ఈ కార్యశాలలో పాల్గొనవచ్చన్నారు.
అమెరికాలోని డెలాయిట్ ఫోరెన్సిక్ మేనేజర్ ఆశిష్ అగర్వాల్; భారత చార్టర్డ్ అకౌంట్స్ ఇన్స్టిట్యూట్ చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సతీష్ అడ్డా, ఢిల్లీలోని క్రెస్ట్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అభిషేక్ మహేశ్వరి; సాఫ్ట్వేర్ కన్సల్టెంట్-డేటా అనలిస్ట్ జ్యోతి రంజన్ నాయక్లు ఈ కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తను పేర్ల నమోదు, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ బి.రమేష్ (98496 25937) డాక్టర్ చంద్రభాను దాస్ (99380 78219)లను సంప్రదించాలని లేదా rbishett@gitam.edu, cdas@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.