పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెర్చ్, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘తృణధాన్యాల ప్రాసెసింగ్: పరికరాలు, యంత్రాలు, ప్యాకేజింగ్’ అనే అంశాలపై గోడపత్రికల రూపకల్పన పోటీని నిర్వహించారు. అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాది 2023 లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు సంగారెడ్డి జిల్లా, కందిలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చరిత కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి, విజేతలను ఎంపిక చేశారు.పండించిన తృణధాన్యాలను తినదగిన లేదా విక్రయించదగిన ఉత్పత్తులుగా మార్చడానికి మూడు దశల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని పోటీలో పాల్గొన్న విద్యార్థులు వివరించారు. వానబెట్టడం, మొలకెత్తించడం తొలి ప్రక్రియ అని, ఉడకబెట్టడం లేదా ఉబ్బడం రెండో దశ అని, వాటిని నిలువ ఆధారిత ఉత్పత్తులుగా చేయడం మూడో ప్రక్రియగా వారు అభివర్ణించారు.
ఈ ప్రక్రియలో డి-హల్గర్లు, మిల్లర్లు, స్టేకింగ్, షఫింగ్ యంత్రాలను వినియోగిస్తారని విద్యార్థులు పేర్కొన్నారు. డి-హల్లర్లు తృణధాన్యాల పైరను తొలగించడానికి పనికొస్తాయని, వ్యర్థాలను తగ్గించడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సమర్థంగా చేయడానికి తోడ్పడుతుందన్నారు. మిల్లింగ్ ప్రక్రియ ద్వారా ధాన్యాన్ని పిండిగా రుబ్బి, నుంచి ఆకృతి, రుచిగా ఉండేలా ఆహార ఉత్పత్తిని తయారు చేయడనున్నారు. తల్బిన తృణధాన్యాలను వేడి, ఒత్తిడి చేయడానికి సస్టింగ్ ప్రక్రియ ఉపకరిస్తుందని విద్యార్థులు తెలియజేశారు. ఆయా యంత్ర పరికరాలు, అని పనిచేసే విధానాలను వారు గోడపత్రికలలో వారు ప్రదర్శించారు. తృణధాన్యాల వినియోగం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. హవానా – 2.0
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16-17 తేదీలలో ‘హవానా – 2.0’ పేరిట ఇంజనీరింగ్ విద్యార్థులకు పలు పోటీలను నిర్వహిస్తున్నట్టు విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తెలియజేశారు. ప్రాజెక్టు ఎక్స్ పో (రూ.30 వేల విలువ గల ఆకర్షణీయమైన బహుమతులు), రోబో రేస్, ఎలక్ట్రానిక్ స్కెచ్, పేపర్-పోస్టర్ : ప్రజెంటేషన్, లెస్ట్ ఫాలోసర్, డ్రోన్ రేస్, టెక్నో క్విజ్, ట్రెజర్ హంట్, వక్తృత్వం వంటి పలు పోటీలను ఆ రెండు. రోజులలో నిర్వహిస్తామన్నారు. ఇందులో విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేస్తామని ఆమె తెలిపారు. హెదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు కూడా ఈ పోటీలలో పాల్గొనవచ్చని, వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్త సాయికుమార్ 93484 55589ని సంప్రదించాలని. డాక్టర్ మాధవి సూచించారు.