పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహిళలలకు విద్య,వైద్య,ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తామని ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఖనాపురంలో ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు . మహిళల రక్షణ కోసం షీ టీమ్ లతో పాటు అనే చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాజకీయ రంగంలో మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు . పురుషులతో సమానంగా మహిళలకు సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో కానాపురం ప్రవీణ సత్యనారాయణ రెడ్డి, పటాన్ చెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, అబ్బగోని సంతోష, కృష్ణవేణి, అక్కమ్మ ,దేవి, శ్రీలత, కళాచారి, భాగ్యలక్ష్మి, అమృతమ్మ, శ్రీకళ, దేవి, బట్టి ఇంద్ర, ఎస్ శ్రీలత, రాణి, దేవి, విజయలక్ష్మి, లావణ్య, జయ శ్రీ, విద్యావతి, నరసమ్మ, మరియు గ్రామ మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ వివిధ సంఘాల నాయకులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.