పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.2014 లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉంటే నేడు 1170 రూపాయలకు పెంచిన ఘనత మోడీకి దక్కిందన్నారు. మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి ప్రజల గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.