సమాజం నుంచి జవాబు ఆశించిందే దళిత రచన…

Telangana

– దళితుల రచనలపై జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ యేసుదాసన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దళితుల రచనలు సమాజం, సంస్కృతి నుంచి సమాధానాన్ని ఆశిస్తాయని కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాల రిటెర్డ్ ప్రొఫెసర్ టి.ఎం. యేసుదాసన్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, దళిత రచనలు, వెలువరించడంలోని సాదక బాధకాలు’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.కులం పరివర్తన చెంది, కుల సంఘాలుగా కొత్త రూపం దాల్చిందని, ప్రతి కులం పేరుతో సంఘాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దళిత పత్రికలు అరుదుగా వెలువడ్డా, తదనంతర కాలంలో కనుమరుగయ్యాయని అన్నారు. రాయడం, రాయకపోవడం, చదవడం, చదవకపోవడం, గొంతులేనితనంతో పాటు సామాజిక సంబంధాలు, మలయాళ దళిత పత్రికల చరిత్ర, కుల సంఘాల పాత్ర, పత్రికల పాత్ర, వాటి సహకారం మొదలైన అంశాలను ప్రొఫెసర్ యేసుదాసన్ వివరించారు.హెచ్ఎస్ ఇన్చార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ ఈ ప్రారంభోత్సవానికి అధ్యక్షత తొలుత, జీఎస్ వహించగా, నిర్వాహకుడు డాక్టర్ సయంతన్ మోండల్ స్వాగతోపన్యాసం చేశారు. మరో కన్వీనర్ డాక్టర్ జోంధాలే. రాహుల్ హిరామన్ వందన సమర్పణతో ఈ ప్రారంభోత్సవం ముగిసింది.జేవీ పవార్, కళ్యాణి ఠాకూర్ చరల్, నకుల్ మాలిక్, ప్రొఫెసర్ రేఖా మెష్రమ్, ప్రొఫెసర్ జె.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాజ్కుమార్ హన్స్, హరీష్ మంగళం, ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, ప్రొఫెసర్ పి. తిరుమల్, ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ వంటి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొని, తమ అభిప్రాయాలను సదస్యులతో పంచుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *