గీతమ్లో దళితుల రచనలపై జాతీయ సదస్సు

Hyderabad Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, దళిత రచనలు, వెలువరించడంలోని సాధక బాధకాలు’ అనే అంశంపై మార్చి 1-3 తేదీలలో జాతీయ సదస్సును . నిర్వహించనున్నారు. మెస్తూర్లోని భారతీయ భాషలు కేంద్ర సంస్థ; దళిత సాహిత్యాన్ని రాయడం, విశ్లేషించడం, అనువదించడాన్ని సమన్వయం చేస్తున్న సంస్థల (కళలు, మానవీయ శాస్త్రాల పరిశోధనా మండలి, నాటింగ్ హామ్ బ్రెంట్-పాల్ వాలెరీ విశ్వవిద్యాలయాల) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు సదస్సు సమన్వయకర్త డాక్టర్ శాంతన్ మండల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.దళిత సాహిత్య ప్రపంచం రావడానికి, వర్గ, జాతిపై విభిన్న సామాజిక-రాజకీయ చర్చలను ప్రసారం చేసిన వివిధ భారతీయ భాషా పత్రికలలో పనిచేసేవారు, పరిశోధక విద్యార్థులు, బోధకులను ఈ సదస్సు ఆహ్వానిస్తోందన్నారు.వివిధ కులాలు, భాషల మధ్య జరుగుతున్న సంభాషణలు, ఆలోచనల మార్పిడి, స్వీయ శోధన, ఆత్మ : పరిశీలనను ఈ సదస్సు ప్రోత్సహిస్తున్నట్టు డాక్టర్ శాంతన్ చెప్పారు. పత్రికా పరిశ్రమ, దేశీయ పత్రికలు, భాష, జాతి జాతీయత, కులం, జానపద కళా ప్రక్రియలు వంటి అంశాలపై ఔత్సాహికులు పత్ర సమర్పణ చేయొచ్చన్నారు. ప్రొఫెసర్ టి.ఎం. యేసుదాసన్, జేవీ పవార్, కళ్యాణి ఠాకూర్ చరల్, నకుల్ మాలిక్, ప్రొఫెసర్ రేఖా మొషామ్,ప్రొఫెసర్ జె.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాజ్ కుమార్ హన్స్, హరీష్ మంగళం, ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, ప్రొఫెసర్పి. తిరుమల్, ప్రొఫెసర్ సౌమ్య దేవమ్మ వంటి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు, తను పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ జోంధాలే రాహుల్ హిరామన్ thiraman:@gilam.edu / smonda@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *