అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :
ప్రజలందరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం పటేల్ గూడా గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రలో గ్రామ దేవతలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నతీశా శ్రీకాంత్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.