పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
_శివనామస్మరణతో చిట్కుల్ గ్రామం అంతా మారుమ్రోగాలి
మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజున చిట్కుల్ లో నిర్వహించే శివోత్సవం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఎంఎన్ఆర్ యువసేన కార్యకర్తలు భక్తులకు అద్భతమైన సేవలందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సూచించారు. 18న హెచ్ఎంటీవీతో కలిసి భారీ స్థాయిలో నిర్వహించతలపెట్టిన శివోత్సవంపై ఎంఎన్ఆర్ యువసేన సభ్యులతో నీలం మధు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను వివరిస్తూ వారికి దిశానిర్థేశం చేశారు. కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఉండాలని, అక్కడే నిలుపుకునేలా యువసేన సభ్యులు గైడ్ చేయాలన్నారు. కార్యక్రమం నిర్వహించే మల్లన్నగుడి ప్రాంగణంతో పాటు చిట్కుల్ గ్రామం మొత్తం శివనామస్మరణతో మారుమోగాలన్నారు.చిట్కుల్ లో ఆ పరమశివుడే తాండవించిన అనుభూతి భక్తులకు కలగాలన్నారు.
12 శివలింగ అవతారాలకు భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం ఉంటుందని, నర్మదా నది నుంచి తీసుకువచ్చే శివలింగాన్ని తీసుకువస్తున్నారు. శివపార్వతులకు ఇస్నాపూర్ చౌరస్తా నుంచి కార్యక్రమ వేదిక వరకు శోభయాత్ర ఉంటుందని మధు సభ్యలకు వివరించారు. శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ సమయంలో అభిషేకం, హోమం, మహన్యాస రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతాయన్నారు. గీతామాధురి, శ్రీకృష్ణ, రేవంత్, సాహితీ చాగంటి, మధు ప్రియ వంటి ప్రముఖ గాయనీగాయకులచే సంగీత విభావరి కూడా ఉంటుందని తెలిపారు ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంతో ఎంఎన్ఆర్ యువసేన సభ్యులు పూర్త భక్తి భావంతో సేవకులుగా పనిచేయాలని మధు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దైవకార్యంలో మనం పాల్గొనడం పుర్వజన్మసుకృతంగా భావించాలని యువసేన సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఎంఎన్ఆర్ యువసేనకార్యకర్తలు పాల్గొన్నారు.