జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్నిపెంపొందించినందుకు, విద్యార్థుల ప్రతి అంశాలను ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలి అనే దృక్పధంతో జిన్నారం మండల వ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సైన్స్ మొబైల్ ల్యాబ్ ను జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సమక్షంలో వావిలాల, నల్తూర్,కేజిబివి స్కూల్, జిన్నారం,మంగంపేట, కొడకంచి, మాదారం పాఠశాలలకు అందజేశారు.ఎంపీపీ మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ ధర 80 వేలు విలువ చేసే సైన్స్ పరికరాల ల్యాబ్ ను, మొత్తం 7 యూనిట్ లకు సుమారు 6 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే సైన్స్ మొబైల్ ల్యాబ్ ను డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు అందించడం అభినందనీయమని విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పట్ల మరింత అవగాహన పెంచేందుకు తోడ్పడుతున్న రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైన్స్ ల్యాబ్ ను ప్రతి స్కూల్ విద్యార్థులు సద్వినియోగం మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరుతున్నారు .జిన్నారం మండలంలోని పాఠశాలలకు విద్యార్థులకు కావలసిన సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.