పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి అసెంబ్లీలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిసి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు, షెడ్యూల్ కులాల వారికి వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా రూపొందించారన్నారు. మెట్రో రైల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అలాగే దళిత బంధు, రైతుకు రుణమాఫీ, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, టిఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీను, టిఎంఎంఎస్ ప్రధనకార్యదర్శి అల్లుడు జగన్, తదితరులు పాల్గొన్నారు