_నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన 16 లక్షల 96 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. పూర్తి పారదర్శకతతో, రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ చారి, రాజేష్, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.