పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
సృజనాత్మకత లేదా ఏదైనా ఒక కళారూపం పోటీ నుంచి వస్తుందని, అది ఏ సందర్భంలో, ఎక్కడ, ఎవరు, ఎలా రాశారు అనే దాని గురించి ప్రత్యేకంగా చెబుతుందని ‘బీబీల గది’ (బీబీస్ రూమ్) రచయిత్రి నజియా అక్తర్ అన్నారు. హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి ‘నారీ కి కలమ్ సే’ (మహిళా రచయితల సంబరాలు)లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.గీతం స్టూడెంట్ లెఫ్ సౌజన్యంతో మహిళా లీడర్స్ ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘బీబీస్ రూమ్’ పుస్తక రచనానుభవాలను ఆమె విద్యార్థులతో పంచుకున్నారు. తాను హైదరాబాద్ సంస్థాన అధికార మార్పిడిపై లోతైన పరిశీలన చేపట్టానని, ఆ క్రమంలోనే అప్పట్లో మహిళా రచయితలు, వారి రచనల గురించి తెలిసినట్లు నజియా చెప్పారు. విభజన సమయంలోని మహిళా సాహిత్యం తనకు పెద్దగా లభించలేదని, అయితే కొందరు వారి ఇళ్లలో ఉన్న రచనలను తనతో పంచుకోవడం ప్రారంభించారని, అలా అధికార మార్పిడి సమయంలో మహిళల జీవనం ఎలా ఉండేది, వారి సృజనాత్మక రచనల గురించి తెలిసిందన్నారు.
అలా ఆయా కుటుంబాల్లోని తల్లులు, సోదరీసుణులు, అమ్మమ్మలు ఉర్దూ భాషలో, గద్య రూపంలో రాసిన 150 పుస్తకాలను తాను అధ్యయనం చేసినట్టు అకర్ హెదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ కావడం వల్ల హెదరాబాద్ ఉర్దూరచయిత్రుల సాహిత్యం ఉందని చాలామందికి తెలియదని నజియా చెప్పారు
. కొన్ని కారణాల వల్ల సాహిత్య చరిత్రలో కూడా ఉర్దూ మహిళా రచయితల ప్రస్తావన కొంత తక్కువగానే ఉందన్నారు. అయితే తాను ఆనాటి గద్య రచనలను చదివాక, స్త్రీ విద్య, పర్దా వంటి వాటిసె చురుకెన సామాజిక సంస్కణ ఉద్యమాలు ఆనాటి సమాజంలో ఉన్నట్టు కనుగొన్నానని ఆమె చెప్పారు. తన పుస్తకంలో జీనత్ సాజిదా, నజ్మా నిఖత్, జిలానీ బానో అనే ముగ్గురు రచయితలపై ప్రధానంగా దృష్టి, సారించినట్టు నజియా అక్తర్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చారు.