అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కె కళ సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నంది పురస్కార మహోత్సవాల్లో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బీరంగూడ శ్రీకృష్ణవేణి టాలెంట్ పాఠశాల విద్యార్థులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి పోటీల్లో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
