: ఉమామహేశ్వర దేవాలయంలో అదనపు గదులు నిర్మాణానికి 14 లక్షల రూపాయల విరాళం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు పట్టణ పరిధిలోని జెపి కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్వహిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ 14 లక్షల రూపాయల విరాళం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పది లక్షల రూపాయలు అందించగా, శనివారం మరో నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందించారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం పటాన్చెరువు మండలం భానూరు గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సప్తమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.