పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్, శాంతినగర్ కాలనీలలో 62 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 80 లక్షల రూపాయలతో పూర్తి చేసిన సిసి రోడ్డును ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతన సిసి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా నూతన కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, భారత రాష్ట్ర సమితి పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.