పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, భద్రతా సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన జ్ఞాపికలు, ప్రత్యేక ప్రశంసా పత్రాలనిచ్చి సత్కరించారు.తొలుత, జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమం, విద్యార్థుల దేశభక్తి గేయాలు, నృత్యాలు, పాటలతో గీతం ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. ఎన్సీసీ-ఎన్ఎస్ఎస్-స్టూడెంట్ లెఫ్, స్పోర్ట్స్ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది చేసిన కవాతు గణతంత్ర శోభను మరింత పెంచింది. చివరగా, అల్పాహారంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసాయి.గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష, కెరీర్ గెడైన్స్ సెంటర్ డెరైక్టర్ నాతి వేణుకుమార్, పలు విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, సహ సిబ్బంది తదితరులు ఈ వేడుకలలో పాల్గొని గణతంత్ర స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకున్నారు.



