– అండగా ఉంటామని హామీ
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
చికాగో దేశం లోని గవర్నర్స్ స్టేట్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడ్డ భారతీ నగర్ డివిజన్ కు చెందిన సాయి చరణ్ కుటుంబాన్ని మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని, సాయి చరణ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఉన్నారు.