విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Telangana

శిశు విహార్ హై స్కూల్ లో ఘనంగా యానివల్ డే కార్యక్రమం

కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

:విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ లో చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అనిల్ కె. పిల్లై, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్.బీనా పిల్లై ల ఆధ్వర్యంలో ఘనంగా యానివల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ యానివల్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల యొక్క ప్రతిభ పైన మాట్లాడాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే మంచిని మాత్రమే తెలుసుకొని, చెడు విషయాల జోలికి వెళ్ళవద్దన్నారు. అపరిచిత వ్యక్తులు మెసేజ్ లు ఫార్వర్డ్ చేసి ఓటీపీలు చెప్పమంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. అలా అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పి చాలామంది విద్యార్థులు, యువత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించాలని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకొని వారి తల్లిదండ్రులకు, గురువులకు, స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా పటాన్‌చెరు, కర్దనూర్ బ్రాంచులలో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తున్న శిషు విహార్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులు చేసిన డ్యాన్సులు, సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, శిశు విహార్ హై స్కూల్ లో చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అనిల్ కె. పిల్లై, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్.బీనా పిల్లై, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *