పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఫిట్నెస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్, ఆల్విన్ కాలనీలో 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ లను స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, బహిరంగ ప్రదేశాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

