శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శేరిలింగంపల్లినియోజకవర్గంలో ని హఫీజ్ పెట్ డివిజన్ లో గల మైత్రి నగర్ లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్బంగా వివేకానంద విగ్రహానికి మియాపూర్ బిజెపి సీనియర్ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, భారత దేశ ఖ్యాతిని, సంస్కృతి సాంప్రదాయాల విలువలను ప్రపంచంచానికి చాటిచెప్పిన మహనీయుడు, గొప్ప ఆదర్శవంతుడు ఆయిన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
