రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇన్ స్పైర్ సైన్స్ పోటీలో రామచంద్రాపురంలోని విద్యాభారతి హైస్కూల్ విద్యార్థి ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. విద్యాభారతి హైస్కూల్‌లో డ్రైవర్స్ డ్రస్‌నెస్ డిటెక్టర్ సిస్టమ్ ఎంపిక చేయబడిందని మరియు దీనిని నిర్మల్‌లో రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ 2022 పోటీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించడం చాలా గొప్ప విషయమని రామచంద్రాపురం బ్రాంచ్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఏకైక సైన్స్ ప్రాజెక్టు ఇదేనని సోమవారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైన్స్ ఫేర్ పోటీలను సందర్శించి ఎంపికైన విద్యార్థి సాయి సూర్యవర్మ ను అభినందించారు. విద్యాభారతి హైస్కూల్, రామచంద్రాపురంలోని మొత్తం 5 ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయని 2 సంవత్సరాల నుండి ఇన్‌స్పైర్ మనక్ అవార్డులలో ఎంపిక చేయబడ్డాయని, మరియు ఎంపికైన విద్యార్టీకి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం 50 వేల రూపాయలు చెలిస్తారని తెలిపారు.

