పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంత మెన కెరీర్ ‘ అనే అంశంపై జనవరి 8 , 2023 న ( ఆదివారం ) ఉదయం 10.00 నుంచి 11.30 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . బెర్లిన్ ( జర్మనీ ) లోని ప్రముఖ ఆర్కిటెక్ట్ , సాంకేతిక కళాకారుడు , కంప్యూటేషన్ డిజైనర్ రితయన్ రథ్ ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు . ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl.li/csbjt ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చని , ఇతర వివరాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధా రాయ్ sroy2@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు .
