జ్యోతి విద్యాలయలో ఘనంగా స్టూడెంట్ ఫెస్ట్

politics Telangana

_పిల్లలను కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దాలి – డిసిపి శిల్పవ ళ్లి

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు చక్కటి చదువుతోపాటు చక్కటి గుణగణాలను నేర్పుతూ అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి అన్నారు. బిహెచ్ఇఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. పిల్లలను కేవలం చదువుకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్, ట్రెండ్ అనే ధోరణిలో పడి పెడదోవ పెట్టె అవకాశం ఉంది కాబట్ట తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

వివేకంతో కూడిన విద్యను అందించాలని కోరారు. పిల్లలను అతిగారాభంగా కాకుండా వారిని స్వసక్తితో ఎదిగే విధంగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా తయారయ్యేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమాజం పై అవగాహన లేకపోవడం వారిపై వారికి నమ్మకం లేకపోవడం వంటి లక్షణాలతో నేడు అనేక విధాలుగా సమాజంలో చెడిపోయిన వ్యక్తులుగా మారుతున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటినుండి వారి పనులు వారు చేసుకుంటూ , ఇతరులకు సాయం చేసే విధంగా సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారెందుకు మన వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ జయసుధ, హై కోర్ట్ అద్వకేట్ తులసి రాజ్ గోకుల్, రెఫరెండ్ ఫాదర్ సంతురాజ్, స్కూల్ కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, జగధీష్, లతాచౌదరి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *